ETV Bharat / city

జగన్‌ కేసుల మాఫీ కోసం రాష్ట్రానికి ద్రోహం: లోకేశ్ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వార్తలు

వరద బాధితుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. వర్షాలు, వరదలతో రైతులకు భారీ నష్టం జరిగిందని...వారికి కనీసం నిత్యావసరాలు కూడా అందించలేదని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని మండిపడ్డారు. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమేనా రైతు రాజ్యమని లోకేశ్‌ నిలదీశారు. నష్టం అంచనా 100శాతం చేసి ఎకరాకు 25వేలు రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

nara lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
author img

By

Published : Oct 30, 2020, 12:27 PM IST

Updated : Oct 31, 2020, 7:34 AM IST

రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..? : లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,398 కోట్లకు కుదించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజలు 22 మంది వైకాపా ఎంపీల్ని గెలిపిస్తే... వారి చేతగానితనంతో రాష్ట్రానికి రూ. వేల కోట్ల నష్టం మిగిల్చారని మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీసి నిధులు తేలేనివారు.. చంద్రబాబుపై నిందలేస్తే ప్రజలు నమ్ముతారా? అని ధ్వజమెత్తారు. ‘‘సహాయ, పునరావాసం, ఇతర కాంపొనెంట్స్‌ కింద పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినందున అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచాలని చంద్రబాబు కోరితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అప్పట్లో ట్వీట్‌రెడ్డి (విజయసాయిరెడ్డిని ఉద్దేశించి) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు... కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన 5 జిల్లాల్లో పర్యటించి వచ్చిన లోకేశ్‌... శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘‘తెదేపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక కేవలం 2శాతం పనులే చేశారు. ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న మంత్రి ఇప్పుడెక్కడున్నారో తెలియదు’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి...

భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలంటూ ప్రభుత్వం ముందు లోకేశ్‌ నాలుగు డిమాండ్లు ఉంచారు. అవి...!

* పంటనష్టం అంచనాల్ని నూరుశాతం నమోదు చేయాలి. ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలి. పంటనష్టం అంచనాల్ని 10-15 శాతం మాత్రమే నమోదు చేశారని రైతులు చెప్పారు.

* నష్టపోయిన రొయ్యలు, చేపల రైతులకు ఎకరానికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.

* రంగుమారిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

* వర్షాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. అది జగన్‌ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన డిమాండే.

రైతుల పక్షాన నిలిస్తే విమర్శలా?

కష్టాల్లో ఉన్న రైతుల పక్షాన నిలిచిన తనపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ‘లోకేశ్‌ ఏ హోదాలో తిరుగుతున్నారని అంటున్నారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవకూడదా?. 215 మండలాల్లో పంట నష్టం జరిగింది. 10 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంటికి నిత్యావసరాలు అందజేయాలంటే, ఆ ఇల్లు వారం రోజులు నీళ్లలో ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అది మానవత్వమా? వైకాపా పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల్ని కేంద్రానికి తాకట్టుపెట్టి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. దాని బదులు బెంగళూరు, హైదరాబాద్‌, తాడేపల్లిలోని జగన్‌ ప్యాలెస్‌లను, చెన్నైలో నిర్మాణంలో ఉన్న ప్యాలెస్‌ని, భారతి సిమెంట్స్‌ని తాకట్టు పెట్టి రైతుల్ని ఆదుకోవచ్చుగా? లోకేశ్‌ రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశాడని మొదట చెప్పి, ఆ తర్వాత రూ.లక్ష కోట్లన్నారు. అవేవీ నిరూపించలేక... చివరకు ట్రాక్టర్‌ని ర్యాష్‌గా డ్రైవ్‌ చేశానని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించానని కేసు పెట్టారు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో తెదేపా ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు. కోర్టుకి వెళ్లింది వైకాపా నాయకులే. దానిపై చర్చకు మంత్రి బొత్స సిద్ధమేనా?’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు

Last Updated : Oct 31, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.