ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తి చేశారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారో లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మిషన్ క్విడ్ ప్రోకో మళ్ళీ ప్రారంభమయ్యిందని ఆరోపించారు. యువకుడిగా ఉండి.. రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారంటే అప్పుడే అనుమానం వచ్చిందని సీఎం పాదయాత్రను ఉద్దేశించి పేర్కొన్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తులు తీసుకోవటానికి జగన్ అండ్ క్విడ్ ప్రోక్ కంపెనీ స్కెచ్ వేసిందన్నారు. వాలంటీర్ల పేరుతో ఒకపక్క సంవత్సరానికి 4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, మరోవైపు పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: