ETV Bharat / city

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలు

author img

By

Published : Mar 23, 2020, 9:12 AM IST

లాక్ డౌన్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలందరూ పూర్తిగా ఇళ్లకు పరిమితం కావడంతో పాటు సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి. ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడడంపై కూడా నిషేధం విధించారు. నిత్యావసర వస్తువుల రవాణా మినహా మిగతా రవాణాను పూర్తిగా నిషేధించారు. ఆహార పదార్థాలు, ఔషధాల సంబంధిత దుకాణాలు, సంస్థలకు మాత్రమే బంద్ నుంచి మినహాయింపు ఉంది.

kcr
kcr

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నెలాఖరు వరకు తెలంగాణలో లాక్ డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 1897 అంటువ్యాధుల చట్టం లాక్ డౌన్​కు అనుగుణంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 22 అంశాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన దుకాణాలు, సంస్థల జాబితాతో పాటు పూర్తి స్థాయిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల జాబితాను కూడా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. నిత్యావసర వస్తువుల రవాణా మినహా అన్ని అంతర్రాష్ట్ర సరిహద్దులు బంద్ చేస్తారు. ఆర్టీసీ బస్సులు, సెట్విన్, మెట్రో రైల్, ట్యాక్సీలు, ఆటోరిక్షాలు బంద్ అవుతాయి. అత్యవసర వైద్యసేవలు పొందేందుకు మాత్రం రవాణా సౌకర్యానికి అనుమతి ఉంటుంది.

ప్రజా రవాణా బంద్​

నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇస్తారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం సూత్రాలను పాటించాలి. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడడం నిషేధం. వ్యక్తిగత వాహనాలపై డ్రైవర్ మినహా మరొకరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఆహార, ఔషధ సంబంధిత ఉత్పత్తుల దుకాణాలు, సంస్థలకు మాత్రమే బంద్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా దుకాణాలు, సంస్థలన్నింటినీ బంద్ చేయాల్సిందే.

12 కిలోల రేషన్​... 1500 రూపాయలు

పనిచేసే కార్యాలయాలు, దుకాణాల్లో సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. కౌంటర్ల వద్ద మూడడుగుల దూరంలో మార్కింగ్ చేయాలి. పూర్తి పరిశుభ్రతను పాటించడంతో పాటు శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. లాక్ డౌన్ సమయంలో ఆహార భద్రతా కార్డులు కలిగిన 87.59 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. రూ.1,103 కోట్ల విలువైన 3.58 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తారు. కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఒక్కో ఆహారభద్రతా కార్డుకు 1500 రూపాయల చొప్పున మెుత్తం 1,314 కోట్ల రూపాయల మేర నగదు పంపిణీ చేస్తారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తాత్కాలిక, ఒప్పంద, పౌరుగు సేవల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. లేదంటే 1897 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిత్యావసర సరకుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారు.

అత్యవసరం లేని శస్త్ర చికిత్సలు వాయిదా

పరీక్ష పత్రాల మూల్యాంకనం సహా విద్యాసంస్థలు, విద్యాశాఖ కార్యకలాపాలన్నీ మార్చి 31 వరకు బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెలాఖరు వరకు అంగన్ వాడీ కేంద్రాలన్నీ బంద్ చేస్తారు. ఈ సమయంలో మహిళలు, చిన్నారులకు ఇంటివద్దకే రేషన్ అందిస్తారు. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రసవాలు జరిగే అవకాశం ఉండే మహిళల జాబితాను సిద్ధం చేసి ఆస్పత్రుల్లో దవాఖానాల్లో ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటారు. కరోనా సంబంధిత చికిత్సలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సల తేదీల్లో మార్పులు చేస్తారు. అత్యవసరం లేని వాటిని వాయిదా వేస్తారు.

గ్రామస్థాయిలో వరి ధాన్యం కొనుగోళ్లు

ఎక్కడా ప్రజలు గుమిగూడకుండా ప్రభుత్వ శాఖలన్నీ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలోనే వరిధాన్యం కొనుగోలు చేయాలి. కూపన్ల విధానంలో రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేలా చర్యలు చేపట్టాలి. చట్టంలోని నిబంధనలు, మార్గదర్శకాలు అమలు చేసే అధికారాన్ని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై 1897 అంటువ్యాధుల చట్టం, 2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఆరుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.