రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. గత ఏడాది జులైలో రూ.1,916 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది జులైలో రూ.1,416 కోట్లకు విక్రయాలు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే అబ్కారీశాఖ ఆదాయం రూ.500 కోట్లు తగ్గింది. ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల.. సరిహద్దు జిల్లాల్లో భారీగా అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఆ జిల్లాల్లో 50 శాతానికి పైగా అమ్మకాలు తగ్గిపోయాయి.
జిల్లాల్లో మద్యం అమ్మకాల వివరాలు
జిల్లా | 2019లో అమ్మకాలు(రూ.కోట్లలో) | 2020లో అమ్మకాలు(రూ.కోట్లలో) |
అనంతపురం | 115 | 68 |
చిత్తూరు | 185 | 96 |
కృష్ణా | 205 | 98 |
కర్నూలు | 107 | 52 |
ఇదీ చూడండి..