ETV Bharat / city

సర్కారు దుకాణాలతో... తగ్గిన మద్యం అమ్మకాలు

మద్యం అమ్మకాల్లో మార్పు కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న కారణంగా.. నిర్ణీత సమయానికే షాపులు మూతపడుతున్నాయి. ఈ ప్రభావం విక్రయాలపై పడుతున్నట్టు ఆబ్కారీ శాఖ భావిస్తోంది.

తగ్గిన మద్యం అమ్మకాలు
author img

By

Published : Nov 5, 2019, 10:04 AM IST

Updated : Nov 5, 2019, 1:01 PM IST

రాష్ట్రంలో మద్యపానంతో పాటు విక్రయాలూ క్రమేపీ దిగి వస్తున్నాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాదిలో గణనీయంగా విక్రయాలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న కారణంగా.. నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. ఫలితంగా విక్రయాలు క్రమేపీ తగ్గుతున్నట్టు అబ్కారీ శాఖ స్పష్టం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గణాంకాల ప్రకారం 2018 అక్టోబరులో 32 లక్షల 28 వేల 366 కేసుల మద్యాన్ని విక్రయించారు. ప్రస్తుత ఏడాది అక్టోబరులో 23 లక్షల 60 వేల 89 కేసుల మద్యం మాత్రమే అమ్ముడయ్యింది. అటు బీరు విక్రయాలూ గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయని ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 3 వేల 500 మాత్రమే. ఈ కారణంగా క్రమేపీ విక్రయాలు తగ్గుతున్నాయని.. మద్య నియంత్రణ కార్యక్రమమూ సఫలీకృతమవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించకుండా నిఘా పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతో క్రమంగా మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ అడుగులేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.

తగ్గిన మద్యం అమ్మకాలు

ఇదీ చదవండి

పాము నోటిలో పాము.. తింటుందనుకుంటున్నారా!

sample description
Last Updated : Nov 5, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.