తెలంగాణ వరప్రదాయినిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు భావించే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై.. ప్రముఖ ఛానల్ డిస్కవరీ.. విభిన్న భాషల్లో ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. నిన్న రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమైంది. లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో.. ఈ డాక్యుమెంటరీని కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొందిచారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల గోదావరి నదీ జలాల ఎత్తిపోత... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్లో ఐదు బాహుబలి పంపులను వినియోగం.. అక్కడి నుంచి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని సహజ ప్రవాహం ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలించే విధానాన్ని ఇందులో చిత్రీకరించారు. అక్కడి నుంచి దిగువ మానేరు ప్రాజెక్టుకు జలాలను విడుదల చేయడం... గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎస్సారెస్పీ వరద కాలువ గుండా మధ్య మానేరు ప్రాజెక్టు వరకు కొనసాగిన భారీ ప్రవాహం ఆకట్టుకునేలా రూపొందించారు.
ఇదీ చూడండి:
'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'