అనంతపురం జిల్లాలో ఓ చిరుత పులి మృతిచెందింది. ఈ ఘటన సెట్టూరు మండలం మాలేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలోని రోడ్డుపై విగతజీవిగా పడి ఉంది. నోట్లో నుంచి రక్తం వచ్చిన స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్థులు.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి చిరుత మృతికి గల కారణాలు తెలుసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: