అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా - ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల ప్రధాన రాత పరీక్షలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నెల 21, 22 తేదీల్లో అధ్యాపకులు, ఈ నెల 27 నుంచి 29వ తేదీ మధ్య నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్షలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా వీటిని వాయిదా వేసినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
![అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6389316-491-6389316-1584060917412.jpg?imwidth=3840)
అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా
ఇవీ చూడండి-'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుంది'