ETV Bharat / city

కరోనా సమయంలో పరీక్షలు పెట్టడమేంటి?: హైకోర్టు న్యాయవాది

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల వాయిదా, మద్యపాన నిషేధం అమలు కోరుతూ...మే 1వ తేదీ నుంచి నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ విజయవాడలో తెలిపారు.

Lawyer sravan kumar
Lawyer sravan kumar
author img

By

Published : Apr 30, 2021, 3:38 PM IST

రాష్ట్రప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని.. ఎన్నికల సమయంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. మే 1వ తేదీ నుంచి నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ న్యాయవాది శ్రవణ్​కుమార్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టికల్ 21 ప్రకారం, ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి నిర్ణయాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇంత కఠిన పరిస్థితుల్లో లక్షలాది విద్యార్థులకు పరీక్షలు పెట్టడానికి యత్నించడం ముఖ్యమంత్రి తీసుకున్న దారుణమైన నిర్ణయమన్నారు. కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యాన్ని నిషేధించాలన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూస్తున్నారు. మీ ప్రభుత్వం నడపడానికి, మీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మద్యాన్ని ఏరులైపారేలా చేస్తారా అని ప్రశ్నించారు. పరీక్షలను వాయిదా వేయాలి, మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: 'వారి పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.