తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేటితో గడువు ముగియనుంది. మార్చి 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.
- ఇదీ చూడండి: వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు