ETV Bharat / city

మందడంలో రైతుల దీక్షకు వైకాపా ఎంపీ మద్దతు - GNT_YCP MP Krishna Devaraya_Support_Amaravathi_Taza

రైతులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఆయన... సీఎం జగన్ తప్పకుండా న్యాయం చేస్తారని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.

krishna-devaraya-support-amaravathi-formers

author img

By

Published : Jan 31, 2020, 4:56 PM IST

రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: వైకాపా ఎంపీ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్దతు తెలిపారు. మందడం, వెలగపూడిలో దీక్షా శిబిరాలకు వెళ్లిన ఎంపీ... రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆందోళన చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పారు.

రైతుల దీక్షకు మద్దతు తెలిపిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు

'మీరు వ్యాపారాలు చేస్తే వచ్చిన ఆస్తులు కావు... తరతరాలుగా వచ్చినవి. తరతరాల నుంచి వచ్చిన ఆస్తులపై రైతులకు భావోద్వేగం ఉంటుంది. రైతుల ఆందోళనను అర్థం చేసుకోగలం. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి. రైతులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకు వెళ్తారు. అందరూ సహకరించినందువల్లే వైకాపాకు 151 సీట్లు వచ్చాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారు. రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాలని ఆశిద్దాం. రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం' అని ఎంపీ వివరించారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీకి ఐకాస నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.