ETV Bharat / city

Atchannaidu fires on Jagan: 'బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు' - జగన్​పై అచ్చెన్నాయుడు ఫైర్

వైకాపా ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ల నుంచి 18,226 కోట్ల రూపాయలను మళ్లించడం ద్రోహం కాదా..? అని నిలదీశారు. బీసీ గణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం లేదని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డి (cm jagan on Backward Classes) లేదన్నారు.

అచ్చెన్నాయుడు
Atchannaidu fires on jagan
author img

By

Published : Nov 23, 2021, 5:40 PM IST

జగన్ రెడ్డి పాలనలో బీసీలకు(Atchannaidu fires on jagan) అడుగడుగునా వంచనే జరిగిందని తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో.. 16,800 మందికి పదవులు దూరం చేశారని మండిపడ్డారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెదేపా తీర్మానం చేసిందన్న(Atchannaidu on Backward Classes) ఆయన., మళ్లీ తీర్మానం పేరుతో బీసీలకు జగన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు.

బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి, వైకాపా నేతలకు లేదని అచ్చెన్నాయుడు(Atchannaidu fires on ycp govt) దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన సాగిందని విమర్శించారు. మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లుగా ఉన్న బీసీలకు షాడోలను నియమించడం ద్రోహం కాదా..? అని నిలదీశారు. తిరుపతి మేయర్‌గా బీసీని నియమించి రెడ్డి షాడోను నియమించడం వాస్తవం కాదా..? అని ధ్వజమెత్తారు. మంత్రులనూ స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదన్నారు. వెయ్యికిపైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలు 10శాతం కూడా లేరని.., గత తెదేపా హయాంలో 16 వర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ సలహదారుల్లో 71శాతం, యూనివర్శిటీ వీసీల్లో 83శాతం, ప్రభుత్వ న్యాయవాదులు 53శాతం, వర్సిటీ సెర్చ్‌ కమిటీల్లో 75శాతం, తితిదే బోర్డులో 31శాతం, విప్‌ లలో 50శాతం, వర్శిటీ ఈసీ సభ్యుల్లో 28శాతం సొంత సామాజికవర్గం వారినే నియమించారన్నారు. బీసీ కార్పొరేషన్ల(Atchannaidu on bc corporation funds) నుంచి రూ.18,226 కోట్లు మళ్లించడం ద్రోహం కాదా అని నిలదీశారు. 7 లక్షల మంది స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తు చేస్తే.. ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెదేపా హయాంలో ఇచ్చిన రుణాలూ రద్దు చేయడం ద్రోహం కాదా అని అచ్చెన్న ప్రశ్నించారు. బీసీ భవనాలు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, సివిల్స్ కోచింగ్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమంపై వైకాపాకు ధైర్యముంటే చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి:

AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.