తెలంగాణ సీఎం కేసీఆర్కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధిపై కుట్రలు జరుగుతున్నాయంటూ 26 అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఏపీ అభివృద్ధి చెందితే భవిష్యత్ ఉండదనే భయంతో జగన్, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. నాడు నోటికొచ్చినట్లు తిట్టి... నేడు ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రేమ ఒలకబోస్తున్నారని ధ్వజమెత్తారు.హైదరాబాద్లో జగన్ నివాసం, పత్రిక కార్యాలయం అక్రమ నిర్మాణాలని తేలితే చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా వైకాపా, భాజపాతో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని లేఖలో తెలిపారు.
ఇదీ చదివిపెట్టండి...