ETV Bharat / city

'వలస కూలీల కోసం హెల్ప్​లైన్ నంబర్లు ఏర్పాటు చేయండి'

author img

By

Published : May 4, 2020, 4:53 PM IST

వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు మరిన్ని హెల్ప్​లైన్​ నంబర్లు ఏర్పాటుచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎస్​కు లేఖ రాశారు. పనుల్లేక ఆందోళనలో ఉన్న లాక్షలాది కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు నిరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎస్​కు కన్నా లేఖ
సీఎస్​కు కన్నా లేఖ
కన్నా లేఖ
కన్నా లేఖ

వలస కూలీలు, విద్యార్థులు, పర్యటకుల్ని స్వస్థలాలకు పంపేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కూలీల తరలింపు చేపట్టేందుకు రాష్ట్రంలో కేవలం ఇద్దరు నోడల్ అధికారులను నియమిస్తే సరిపోదన్నారు. లాక్​డౌన్ కారణంగా అన్ని కంపెనీలు, పరిశ్రమలు మూతబడి ఎక్కడా పనులు లేక... రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వలస కూలీలు చిక్కుకుపోయారని కన్నా పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఏపీకి చెందిన వారు ఉండిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో 2 హెల్ప్​లైన్ నంబర్లు ప్రకటించి.. అందరి నుంచి విజ్ఞప్తులు తీసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. కూలీలను సొంతూళ్లకు పంపించకపోతే.. ప్రజల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జిల్లా స్థాయిలోనూ రెండు హెల్ప్ లైన్లు ఏర్పాటుచేయాలని చెప్పారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకూ చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి:

మద్యానికి మందు బాబుల పూజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.