స్థానిక ఎన్నికల పరిస్థితిపై అమిత్ షాకు కన్నా లేఖ - latest news on kanna laxmi narayana
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షాకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. 10 ఘటనలను ప్రస్తావిస్తూ అమిత్ షాకు 4 పేజీల లేఖ పంపారు. ఏపీలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. భాజపా అభ్యర్థులను అపహరించి, దాడులు చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. భాజపా అభ్యర్థుల నామపత్రాలు చించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో తెలిపారు.