ETV Bharat / city

'ఏపీలో ఆలయాల పవిత్రతను కాపాడాలి' - ఏపీలో ఆలయ డిక్లరేషన్‌ అంశంపై రగడ

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు కాపాడడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. హిందువులు కాని వారు ఆలయాన్ని సందర్శిస్తే డిక్లరేషన్‌ అవసరం లేదని ఇటీవల తితిదే ఛైర్మన్‌ ప్రకటించారు. పుణ్యక్షేత్రం పట్ల విశ్వాసం ఉన్నవారు ఎవరైనా డిక్లరేషన్‌ సమర్పించకుండా భగవంతుడిని దర్శించొచ్చని తెలిపారు. ఈ ప్రకటన హిందువులు, ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు.

kanakamedala
kanakamedala
author img

By

Published : Sep 21, 2020, 10:22 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు కాపాడడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాజ్యసభ శూన్యగంటలో ఆయన మాట్లాడారు. ‘‘తితిదే ఆలయాన్ని హిందువులు కాని వారు సందర్శిస్తే వారి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీలు గతంలో డిక్లరేషన్‌ సమర్పించారు. హిందువులు కాని వారు ఆలయాన్ని సందర్శిస్తే డిక్లరేషన్‌ అవసరం లేదని ఇటీవల తితిదే ఛైర్మన్‌ ప్రకటించారు. పుణ్యక్షేత్రం పట్ల విశ్వాసం ఉన్నవారు ఎవరైనా డిక్లరేషన్‌ సమర్పించకుండా భగవంతుడిని దర్శించొచ్చని తెలిపారు. ఈ ప్రకటన హిందువులు, ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దాడులు జరిగాయి. రథాల దగ్ధం, విగ్రహాల దొంగతనం వంటివి జరుగుతున్నాయి. అన్నీ మతాలకు సమాన ప్రాముఖ్యం ఇవ్వాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కేంద్రం జోక్యం చేసుకుని హిందువుల మనోభావాలు పరిరక్షించాలి’’ అని రవీంద్రకుమార్‌ కోరారు. ఒడిశాకు చెందిన బిజద సభ్యులు నెకంటి భాస్కరరావు, సస్మిత్‌పాత్రా, అమర్‌పట్నాయక్‌ మద్దతు తెలిపారు.

సంప్రదాయాలపై శ్రద్ధ లేదా?:

‘అన్యమతస్థులు ఎవరైనా కొండమీదికి రావచ్చు. ఏమైనా చేసుకోవచ్చనేలా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం ఉంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఏపీ రెవెన్యూ దేవాదాయ-1, జీవోనంబర్‌ 311 ప్రకారం హిందువులు కానివారు తప్పనిసరిగా డిక్లరేషన్‌ ఇవ్వాలి. గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన సందర్భాల్లేవని సుబ్బారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దేవాలయ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆచారాన్ని తీసేయడంలో ఉన్న ఆంతర్యమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’- ప్రకటనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు

జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

‘అన్యమతస్థుడైన జగన్‌ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చి తీరాల్సిందే. గత బ్రహ్మోత్సవాల సమయంలో జగన్‌ సతీసమేతంగా ఉత్సవాలకు రాకపోవడానికి కారణం వెల్లడించాలి. ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతుంటే విశాఖలోని పెందుర్తి శారదాపీఠం స్వామి మౌనం ఎందుకు వహిస్తున్నారు? - మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి

నామోషీగా భావించేవారికి దర్శనమెందుకు?

తిరుమల ఆలయంలో డిక్లరేషన్‌ ఇవ్వడాన్ని నామోషీగా భావించేవారు శ్రీవారిని దర్శించుకోవడం ఎందుకు? సీఎం జగన్‌ ఇంట్లోకి బయటివారు రావడానికి అనుమతి ఎలా అవసరమో.. అన్యమతస్థులు దర్శనానికి డిక్లరేషన్‌ ఇవ్వడమూ అంతే అవసరం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కంటే మీరు గొప్పవారా? గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డిక్లరేషన్‌ ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు సీఎం జగన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఎలా?’’ - భాజపా నేత లంకా దినకర్‌ ప్రశ్న

నీ ఆలయాన్ని నీవే కాపాడుకో స్వామీ

తితిదే పవిత్రతను దెబ్బతీసేలా ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. స్వామి దర్శనానికి డిక్లరేషన్‌ అవసరం లేదన్న ఛైర్మన్‌ ప్రకటనకు నిరసనగా ఆదివారం అలిపిరి పాదాల మండపం వద్ద తెదేపా నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి..‘నీ ఆలయాన్ని నీవే కాపాడుకో స్వామీ’ అంటూ శ్రీవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిక్లరేషన్‌పై వివాదం వద్దు

తిరుమలలో అన్యమతస్థుల డిక్లరేషన్‌ అంశాన్ని వివాదాస్పదం చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తితిదే అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఇప్పటికే డిక్లరేషన్‌ అంశంపై స్పష్టత ఇచ్చారన్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అయిదేళ్లపాటు ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్‌ లేకుండానే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని, ఆయన కుమారుడైన జగన్‌ ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్‌ అవసరం లేదని సమాధానం ఇచ్చారని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి: సీఆర్డీఏ రద్దు ముమ్మాటికి చట్ట ఉల్లంఘనే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.