ETV Bharat / city

కలవరపెట్టిన కడెం.. ఎట్టకేలకు తప్పిన ముప్పు - కడెం జలాశయం లేటెస్ట్ న్యూస్

kadem Project latest news : ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. పైనుంచి వర్షం. ప్రాజెక్టు విడుదల సామర్థ్యానికి మించి.. ఉవ్వెత్తున ఎగిసిపడే వరద ప్రవాహం. తీరా.. సమయానికి తెరుచుకోని ప్రాజెక్టులోని ఓ గేటు. డ్యాం పైనుంచి పొంగుతున్న వరద నీరు. ప్రమాద హెచ్చరికల జారీతో ఓ వైపు సైరన్.. దేవుడిపై భారం వేసి, ముంపు గ్రామాల నుంచి ప్రజల తరలింపు. ఇలా.. మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ పరిణామాల మధ్య అచ్చం సినిమాలోని సన్నివేశాలను తలపించాయి... కడెం ప్రాజెక్టు వద్ద నిన్నటి పరిస్థితులు. ఊహించని వరద విపత్తుతో.. ప్రాజెక్టు నిర్వహణ మరోసారి సర్వత్రా చర్చనీయంగా మారింది. ఇవాశ వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతోన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కడెం జలాశయానికి ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.

కడెం ప్రాజెక్టు
కడెం ప్రాజెక్టు
author img

By

Published : Jul 14, 2022, 12:38 PM IST

kadem Project latest news : స్వాతంత్య్ర తొలినాళ్లలో నిర్మితమైన కడెం ప్రాజెక్టుకు మరోసారి కష్టం వచ్చింది. 27 ఏళ్ల తర్వాత సామర్థ్యానికి మించి వరదపోటెత్తడంతో ప్రమాదపుటంచుకు చేరుకుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అప్పటి భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా కడెం జలాశయం 9గేట్లతో నిర్మితమైంది. 1959లో భారీగా వరదరావడంతో ఆనకట్టకు కాస్తంత ముప్పువాటిల్లడంతో అప్పటి ప్రభుత్వం 1959లో 18 గేట్లతో పునర్‌ నిర్మాణ పనులను చేపట్టి 1962వరకు పూర్తిచేసింది. కడెం నుంచి మంచిర్యాల వరకు దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. 1995లో మరోసారి భారీగా వరద రావటంతో... మళ్లీ ముప్పు నెలకొంది. వరద ఉద్ధృతి కారణంగా ప్రాజెక్టు ఇరువైపులా ఆనకట్ట కోతకు గురికావడంతో అప్పట్లో ప్రమాదం తప్పింది. కానీ, ఈ ఘటనతో ప్రాజెక్టు పరిసర, దిగువ ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్రభయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా వచ్చిన భారీ వరదలతో కడెం కష్టాలు మళ్లీ తెరపైకొచ్చాయి.

kadem Project inflow : కడెం జలాశయానికి ఇవాళ కూడా భారీగా వరద కొనసాగుతోంది. సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తుండడంతో కడెం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకోగా.... ప్రస్తుతం కాస్త వరద తగ్గుతుండడంతో ప్రమాదం తప్పింది. ముంపు వాసులు మాత్రం భయం నీడనే కాలం వెళ్లదీస్తున్నారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకుగాను.. ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులకు చేరింది. జలాశయంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.... 17 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

kadem Project is over flooded : మంగళవారం రోజున సెకనుకు 2లక్షల క్యూబిక్‌ మీటర్ల ప్రవాహంతో విరామం లేకుండా 24 గంటల ప్రవహిస్తే.... 10 టీఎంసీల నీరు వచ్చిచేరుతోంది. కడెంలో సెకనుకు 2.85లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉండగా...5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎగువన బోథ్‌ ప్రాంతం నుంచి భారీ వరదతో కడెం జలాశయం నీటిమట్టం 700 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం రాత్రికి రాత్రే ప్రమాదపు సైరన్‌ మోగించింది. పక్కనే ఉన్న పాతకడెం గ్రామాన్ని ఖాళీ చేయించింది. దిగువన ఉన్న కన్నాపూర్, కొందుకూరు, పాండవాపూర్, అంబరీపేట, బెల్లాల్‌ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది.

ఇదే క్రమంలో ఉద్ధృతి మరింత పెరగటంతో.... నిన్న ప్రాజెక్టులోని 18గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. 17 గేట్లు తెరుచుకోగా.... సాంకేతిక లోపంతో మరో గేటు తెరుచుకోలేదు. వాస్తవంగా కడెం ప్రాజెక్టులోకి సెకనుకు 2.95లక్షల క్యూసెక్కుల వచ్చే నీటి సామార్థ్యాన్ని తట్టుకునే వెసలుబాటు ఉంది. కానీ మంగళవారం రాత్రి దాదాపుగా 5లక్షల క్యూసెక్కుల నీరురావడం, బయటకు వెళ్లే నీరు దాదాపుగా 3లక్షల క్యూసెక్కులకే పరిమితం కావడంతో ప్రమాదభరితంగా మారింది.

ఓ దశలో చేతులెత్తేసిన అధికారయంత్రాంగం ప్రకృతిపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రకృతి పరిణామాలు.... ప్రాజెక్టు ఎడమవైపున ఉండే ప్రధాన కాల్వకు అకస్మాత్తుగా బుంగపడటంతో భారీగా వరద నీరు బయటికి వెళ్లి, ఇన్‌ఫ్లోకు... ఔట్‌ఫ్లో సమానమైంది. మధ్యాహ్నం తర్వాత ఇన్‌ఫ్లో కాస్త తగ్గి.... సామర్థ్యం 700 అడుగులకుగానూ 699కి చేరటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

"కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉద్ధృతి తగ్గడంతో ప్రమాదం తప్పింది. కడెం ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు. గతంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతాయి. వరద ఉద్ధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు సమర్థంగా పనిచేశారు." ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి 'ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌- “ఓ అండ్‌ ఎమ్‌" విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈఎన్సీ నేతృత్వంలో సీఈలు, ఎస్‌ఈలు, ఈఈ, డీఈ, జేఈలతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి.... దీనికోసం బడ్జెట్‌ను సైతం కేటాయించింది. ఈ మేరకు వర్షాకాలం ఆరంభానికి ముందే ప్రాజెక్టు పనితీరు, గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాలు, వరద ఉప్పొంగితే దిగువన ఉత్పన్నమయ్యే అంశాలను ఈ విభాగాం అధ్యయనం చేసి... ప్రాజెక్టులవారీగా మరమ్మతులు చేపట్టాలనేది.. ప్రభుత్వ నిర్ణయం. కానీ.... తగిన సిబ్బంది లేకపోవటం, పర్యవేక్షణలోపంతోనే కడెం కష్టాలకు కారణమని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.