ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి జస్టిస్ మహేశ్వరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో ప్రధాన న్యాయమూర్తి తోపాటు గవర్నర్ హరిచందన్, సీఎం జగన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేత
అంతకు ముందు నూతన ప్రధాన నాయ్యమూర్తికి కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ సాదర స్వాగతం పలికారు. తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ప్రసాదాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీచదవండి