ETV Bharat / city

Case on pushpa pre release event: "పుష్ప" ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. నిర్వాహకులపై కేసు! - పుష్ప మూవీ

Case on pushpa pre release event: "పుష్ప" చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్​ నిర్వాహకులపై జూబ్లీహిల్స్​ ఠాణాలో కేసు నమోదైంది. ఈవెంట్​ సందర్భంగా అనుమతికి మించి అభిమానులను సమీకరించడంతోపాటు.. కొవిడ్​ నిబంధన చర్యలు చేపట్టలేదంటూ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పుష్ప ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వాహకులపై కేసు
pushpa pre release event case
author img

By

Published : Dec 13, 2021, 11:04 PM IST

Case on pushpa pre release event: "పుష్ప" చిత్రం ప్రీ-రిలీజ్​ సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్​ యూసఫ్​ గూడ పోలీసు మైదానంలో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకకు అనుమతికి మించి అభిమానులను సమీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతేకాదు.. ఈ కార్యక్రమంలో కొవిడ్​ నిబంధనలు పాటించలేదని.. రక్షణ చర్యలు చేపట్టలేదంటూ ఈవెంట్​ నిర్వాహకులైన మైత్రీ మూవీ మేకర్స్​ ప్రతినిధి కిశోర్​పై జూబ్లీహిల్స్​ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్తంభించిన ట్రాఫిక్​..
ఆదివారం పుష్ప మూవీ ప్రీ-రిలీజ్​ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. యూసఫ్​ గూడ చెక్​పోస్ట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. పలువురు సినీ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. అభిమానులు, ప్రజలకు వేడుకకు రావడంతో ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.