ఆత్మ నిర్భర్ భారత్ అమల్లో భాగంగా అందరూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వినాయకచవితి నుంచే ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ పండుగకు ఏం కొన్నా.. అది ఇక్కడ తయారైందో లేదో చూడాలని సూచించారు.
ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని.. కేవలం మన దేశ అభివృద్ధికి సంబంధించినదని పవన్ స్పష్టం చేశారు. దేశీయ ఉత్పత్తులకు గిరాకీ కల్పించేందుకు అందరూ తప్పనిసరిగా దీన్ని పాటించాలని జనసేనాని కోరారు. మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఇదే ఆత్మ నిర్భర భారత్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: