నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం పెంచడం సహా తక్షణ సాయంగా రూ.పదివేలు ఇవ్వాలన్న డిమాండ్‌తో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసైనికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధిత రైతులతో కలసి కలెక్టరేట్లకు వెళ్లిన జనసైనికులు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు.
-
Janasenaparty Chief Sri @PawanKalyan Road show- Pedana (3/4)#JSPStandsWithFarmers pic.twitter.com/DjrJhyeCYy
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Janasenaparty Chief Sri @PawanKalyan Road show- Pedana (3/4)#JSPStandsWithFarmers pic.twitter.com/DjrJhyeCYy
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020Janasenaparty Chief Sri @PawanKalyan Road show- Pedana (3/4)#JSPStandsWithFarmers pic.twitter.com/DjrJhyeCYy
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరు, గుడివాడ, పెడన నియోజకవర్గాల మీదుగా సాగిన ర్యాలీ మచిలీపట్నానికి చేరుకుంది. దారి వెంట పవన్ కళ్యాణ్‌కు అభిమానులు, కార్యకర్తలు, రైతులు నీరాజనాలు పట్టారు. పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. దారి వెంట పలుచోట్ల ఆగిన పవన్ .. తుపాను వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించారు. పరిహారం అందక రైతులు పడుతోన్న కష్టాలను తెలుసుకున్నారు. విజయవాడ - గుడివాడ రహదారి అధ్వానంగా మారిందని, కనీస మరమ్మతులు చేయకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు పలువురు వాహనదారులు పవన్ దృష్టికి తెచ్చారు. గుడివాడ నగరానికి చేరుకున్న పవన్.. నెహ్రూ చౌక్ కూడలిలో బహిరంగ సభలో రైతులు, వాహనదారులు తన దృష్టికి తెచ్చిన అంశాలను వెల్లడించారు. స్థానిక మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులు నిర్వహించడంలో ఉన్న సమర్థత ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్లడంలో లేదని మండిపడ్డారు.
-
సినిమాలు చేస్తూ ఖాళీ సమయాల్లో చేస్తున్నామా ? మీరేం చేస్తారు పేకాట క్లబ్బుల్లో పేకాట ఆడుతారు - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/4E60J0oO7i
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">సినిమాలు చేస్తూ ఖాళీ సమయాల్లో చేస్తున్నామా ? మీరేం చేస్తారు పేకాట క్లబ్బుల్లో పేకాట ఆడుతారు - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/4E60J0oO7i
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020సినిమాలు చేస్తూ ఖాళీ సమయాల్లో చేస్తున్నామా ? మీరేం చేస్తారు పేకాట క్లబ్బుల్లో పేకాట ఆడుతారు - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/4E60J0oO7i
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
రాజకీయం చేస్తున్నారు....
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల మీదుగా పవన్ ర్యాలీ కొనసాగింది. దారి వెంట పలువురు రైతులు తమ గోడును పవన్‌కు వెళ్లబోసుకున్నారు. మచిలీపట్నంలో రైతులను పరామర్శించిన పవన్... వారికి మద్దతుగా పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ఖజానాకు 40 శాతం ఆదాయం తెస్తోన్న రైతన్నలకు కష్టాలు వస్తే వాటిని తీర్చడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని పవన్ దుయ్యబట్టారు. సమస్యల పరిష్కరించాలని తాను రోడ్డుపైకి వస్తే వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
తీరు మార్చుకోవాలి....
రైతులు కన్నీరు కారుస్తుంటే.. ఎన్నికైన 151 మంది ప్రజా ప్రతినిధులు కంట్రాక్టులు, కమిషనన్లు, దందాలే లక్ష్యంగా వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక, గనులను, మద్యం ఆదాయం దోచుకోవడానికే 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారా.. అని నిలదీశారు. రైతులకు అండగా నిలబడనప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఏం ప్రయోజనమన్నారు. వెంటనే తుపాను వల్ల నష్టపోయిన రైతుకు ఎకరాకు ౩5 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు కింద సాయం చేస్తోందన్న పవన్... తుపాను వల్ల రాష్ట్రంలో 80లక్షల మందిపైగా రైతులు నష్టపోతే కేవలం 40లక్షల మంది రైతులకే పరిహారం ఇస్తున్నారన్నారు. రైతులకు కనీసం విత్తనాలు ఇవ్వలేదనిని, రంగు మారిన ధాన్యం కొనలేదన్నాలు. పాలనలో అవకతవకలు ఉన్నాయన్న జనసేనాని....అసంబద్ధంగా పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకునేందుకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి పేర్నినాని పై పవన్ మండిపడ్డారు.
-
మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి..
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/gpWyO5wWsI
">మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి..
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/gpWyO5wWsIమీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి..
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం - JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/gpWyO5wWsI
పోరాటం ఆగదు....
కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ డీఆర్వో కు వినతి పత్రం ఇచ్చారు. రైతులకు ఎకరాకు 35 వేల పరిహారం పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆపేది లేదని పవన్ స్పష్టం చేశారు. రైతులకు పరిహారం పెంచాలని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ జనసేన ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి అందించిన జనసైనికులు... రైతులకు పరిహారం పెంచడం సహా వెంటనే ఇన్ పుట్ సబ్సిడీని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.