జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో అపోలో వైద్యులు పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3న తిరుపతిలో పాదయాత్ర, సభలో పవన్ పాల్గొన్నారు. హైదరాబాద్ వచ్చాక కరోనా పరీక్షలు చేయించుకోగా.. నెగటివ్ వచ్చింది. వైద్యుల సూచనతో తన వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి పవన్‌కు స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు రావటంతో మరోసారి కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయ్యింది.
పవన్ ఆరోగ్యం గురించి చిరంజీవి దంపతులు ఆరా తీశారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:
ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి