రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు(pawan kalyan fires on YCP Government over floods). రాష్ట్రంలో వరదల భీభత్సంతో ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయని.. ప్రాణాలు కోల్పోతున్నారని.. పొలాల్లో ఇసుకమేటలు చూసి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇవ్వటమేంటన్న జనసేనాని.. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు.
-
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం,
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg
">వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం,
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZgవరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం,
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg
'రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయి. పొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..?' - పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. రైతన్నలు బాధలో ఉంటే ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఏమిటి..? అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వరదలతో జనం.. సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా..? నీరో తత్వం ఒంటబట్టిందా? అని ట్విటర్ వేదికగా నిలదీశారు.
-
జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?
— Manohar Nadendla (@mnadendla) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan గారూ!! pic.twitter.com/qt2KMgwqYI
">జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?
— Manohar Nadendla (@mnadendla) November 21, 2021
ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan గారూ!! pic.twitter.com/qt2KMgwqYIజల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?
— Manohar Nadendla (@mnadendla) November 21, 2021
ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan గారూ!! pic.twitter.com/qt2KMgwqYI
భారీ వర్షాలతో రాయలసీమలోని మూడు జిల్లాలతో పాటు.. నెల్లూరు జిల్లాలో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. 20 మందికి పైగా ప్రాణాలు నీళ్లల్లో కలిసిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడపలో చెరువులు, డ్యామ్‌లు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరదలకు జరిగిన నష్టంపై శనివారం ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వెల్లడించింది.
ఇదీ చదవండి:
తెలంగాణ స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన జగన్, కేసీఆర్