ETV Bharat / city

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలి: పవన్​ కల్యాణ్​ - దిల్లీలో అమిత్​షాతో పవన్ కల్యాణ్ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో 18 వేలమంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడుతుందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

pawan kalyan met amith sah in delhi
కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో పవన్ కల్యాణ్ భేటీ
author img

By

Published : Feb 9, 2021, 9:52 PM IST

Updated : Feb 9, 2021, 10:47 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రజల మనోభావాలు గ్రహించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పవన్‌ కోరారు. అప్పులు త్వరగా మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న పవన్‌... విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో 18 వేలమంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడుతుందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ ప్రైవేటీకరణతో 20 వేలమంది ఒప్పంద ఉద్యోగులపై ప్రభావం ఉంటుందన్నారు. పరోక్షంగా మరో లక్షమంది జీవితాలపై ప్రభావం ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి:

విశాఖలో 'ప్రొఫెషనల్ స్కిల్స్ ఫర్ జర్నలిస్ట్స్' పుస్తకావిష్కరణ

Last Updated : Feb 9, 2021, 10:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.