ETV Bharat / city

హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా..?: పవన్ కల్యాణ్ - pawan kalyan fiers on ycp govt latest news

జనసైనికులపై హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా?అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని..లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 17, 2021, 5:19 PM IST

  • జనసేన కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేయరా? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/kC84G3WufB

    — JanaSena Party (@JanaSenaParty) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జనసేన అభ్యర్థులపై జరిగిన దాడిని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. జనసైనికులపై హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా?అని ప్రశ్నించారు. గోరంట్ల, అమలాపురం, నూజివీడు ఘటనలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో ఫ్యాక్షన్ పోకడ రాష్ట్రమంతటా విస్తరించిందని దుయ్యబట్టారు. జనసైనికులపై దాడులపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. వీటన్నింటిపై కేసులు నమోదు చేయకపోతే చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రేపు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక.. ఇవాళ వైకాపా జాబితా ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.