ETV Bharat / city

'జగనన్న విద్యా కానుక' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

కృష్ణా జిల్లా పునాదిపాడులోని.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'జగనన్న విద్యా కానుక' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులకు దాదాపు 650 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం.. స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తుంది.

jagan vidya kanuka scheme
jagan vidya kanuka scheme
author img

By

Published : Oct 8, 2020, 12:14 PM IST

Updated : Oct 8, 2020, 12:41 PM IST

'జగనన్న విద్యా కానుక' పథకం కార్యక్రమంలో విద్యార్థులతో సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పాఠశాలలో 'నాడు-నేడు' పనులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ పథకం ద్వారా ఏపీలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులకు దాదాపు 650 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం.. స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనుంది. అన్నిప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీవీబీ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు.. స్డూడెంట్‌ కిట్లు పంపిణీ చేస్తారు. ఇప్పటికే కిట్లను ఆయా పాఠశాలలకు పంపామన్నారు. కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్‌ బుక్స్.. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇస్తామని వెల్లడించారు.

స్టూడెంట్ కిట్లు సరైన సైజుల్లో రాకపోయినా.. పంపిణీ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విషయాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయుల దృష్టికి లేదా.. 912129051, 9121296052 హెల్ప్​లైన్ నెంబర్​కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా.. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల్లో.. కిట్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు

Last Updated : Oct 8, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.