అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన అన్ని ఛార్జ్ షీట్లను కలిపి.. అభియోగాల నమోదు ప్రక్రియను నిర్వహించాలని సీబీఐ కోర్టును జగన్మోహన్ రెడ్డి కోరారు. అభియోగ నమోదు ప్రక్రియను అన్నింటినీ కలిపి ఒకేసారి నిర్వహించాలని వైఎస్ జగన్, విజయ్ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు అంగీకరించిందన్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లలో ఐదింటిని కలిపి అభియోగాల నమోదు ప్రక్రియపై విచారించేందుకు గతంలో సీబీఐ కోర్టు అంగీకరించిందని... మిగతా ఆరు కూడా కలిపాలని కోరుతున్నామని జగన్ న్యాయవాది పేర్కొన్నారు. తుది విచారణ అన్ని ఛార్జ్ షీట్లలో కలిపి విచారణ జరపాలని కోరడం లేదన్నారు. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి :