అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటికి చెందిన ముగ్గురు విద్యార్థులు అవర్ ఐ పేరిట ఏర్పాటు చేసిన అంకుర సంస్థ విజయవంతంగా నడుస్తున్నట్లు ఉపకులపతి వి.సాంబశివరావు తెలిపారు. యూనివర్శిటీకి చెందిన మిరాన్, సురభ్, సౌరవ్ అనే ముగ్గురు విద్యార్థులు ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే అవర్ ఐ పేరిట అంకుర సంస్థ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయ్యే దృశ్యాలను విశ్లేషించి ఎప్పుడేం జరుగుతుందో వెనువెంటనే సంబంధిత యజమానులకు సమాచారం ఇచ్చేలా వీరు సాఫ్ట్వేర్ రూపొందించారు.
వెంచర్ క్యాపిటలిస్టుల ద్వారా 120 వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీ ప్రారంభించి దాదాపు ఏడాది నుంచి నడుపుతున్నారు. అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ విద్యార్థులైన ఈ ముగ్గురు విద్యార్థులు ఈ ఏడాదే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నారు. విద్యార్థులుగా ఉంటూనే అంకుర సంస్థ ఏర్పాటు చేసి విజయం సాధించిన వారిని యూనివర్శిటి అధికారులు సన్మానించారు.
యూనివర్శిటి అనుసరిస్తున్న విద్యా విధానాలే ఇందుకు కారణమని ఉపకులపతి సాంబశివరావు తెలిపారు. ఈ యువ బృందానికి యూనివర్శిటి తరపున 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: