ETV Bharat / city

'అధిక ధరలకు విద్యుత్ కొనటం దుర్మార్గం కాదా?'

వైకాపా ప్రభుత్వ అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు
author img

By

Published : Oct 3, 2019, 10:57 PM IST

చంద్రబాబు నాయుడు ట్వీట్

పీపీఏలపై దుష్ప్రచారం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సౌర, పవన్‌ విద్యుత్‌ రూ.3 నుంచి రూ.4.84లకే వస్తుంటే శ్రద్ధ పెట్టకుండా... ఇప్పుడు యూనిట్‌ రూ.11.68కి కొనడం దుర్మార్గపు చర్య కాదా? అని మండిపడ్డారు. మహానది కోల్ మైన్స్‌లో టన్ను బొగ్గు ధర రూ.1,600 ఉండగా... సింగరేణిలో టన్నును రూ.3,700కు కొనడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆర్థికభారం కలిగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ముందుజాగ్రత్తగా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన అవగాహన లేకుండా, విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టారని పేర్కొన్నారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ నియోజకవర్గం,
బేలుగుప్ప మండలం.

కారువు ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

పట్టు పురుగుల పెంపకంలో నూతన విధానాలను అవలంబిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు అనంతపురానికి చెందిన ఓ రైతు. జిల్లాలోని బెలుగుప్ప మండలం దుద్దేకుంటకు చెందిన రైతు పెద్దన్న అతి తక్కువ పెట్టుబడితో పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట మల్బరీ సాగులోకి ప్రవేశించిన పెద్దన్న ఆ రంగంలో అనతికాలంలోనే తన ముద్ర వేశారు. దాదాపు 15 ఎకరాల్లో మల్బరీ పండిస్తూ ప్రతి పంటకు రెండు లక్షలకు పైగా లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఇలా సంవత్సరానికి 11 నుంచి 12 పంటలను తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాగు విధానాలను తెలుసుకోవడానికి బీహార్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన రైతులు వస్తున్నారు.

*మల్బరీ పెంపకం*

పట్టు పురుగుల పెంపకంలో ప్రధానమైంది మల్బరీ తోటల పెంపకం. మల్బరీ ఆకుల నాణ్యత బాగుంటేనే పంట నాణ్యత బాగుండేది. దీని కోసం పెద్దన్న నూతన విధానాలను అవలంభిస్తున్నారు. 7×3×2 ప్రకారం జోడుసాళ్ళ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీని ద్వారా మల్బరీ ఆకులు చాలా మెత్తగా వస్తాయని ఆయన చెబుతున్నారు. మొక్కలను కత్తిరించిన తరువాత పోగయ్యే వ్యర్థాలను వేస్ట్ డీకంపోజర్ పద్ధతిని ఉపయోగించి వర్మి కంపోస్టుగా మారుతున్నారు. దీని ద్వారా ఎరువులకు పెట్టాల్సిన పెట్టుబడి చాలా వరకు తగ్గిపోతుందని చెపుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో మల్బరీ సాగు చేసి అనుకున్న స్థాయిలో దిగుబడి సాధిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

*పట్టు పురుగుల పెంపకం*

పట్టు పురుగులను కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకోవాలని పెద్దన్న చెబుతున్నారు. ఏమాత్రం అశ్రద్ధ వహించిన పురుగులు చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నారు. ముఖ్యంగా పట్టుపురుగుల షెడ్డు లో ఉష్ణోగ్రతను పాటించాలని దీనికోసం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు పేర్కొన్నారు.

Body:బైట్ 1 : పెద్దన్న, రైతు.
బైట్ 2 : రాజేంద్రప్రసాద్, రైతు.
బైట్ 3 : మల్లికార్జున, రైతు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, ananthapuram.
date : 03-10-2019
sluge : JK_AP_ATP_71_03_malbari_success_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.