ETV Bharat / city

పర్యాటకుల కోసం.. ఐఆర్‌సీటీసీ, టీఎస్​టీడీసీ ప్రత్యేక యాత్రలు! - పర్యాటక ప్రాంతాలు

పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో టూరిజం సంస్థలు యాత్రలు నిర్ణయించేవి. ఇప్పుడు పర్యాటకులే ఎక్కడకు వెళ్లాలి.. ఎన్ని రోజులుండాలి.. ఎప్పుడు తిరిగి రావాలనేది నిర్ణయించుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఐఆర్‌సీటీసీతో పాటు.. ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు, ప్రైవేటు టూరు ఆపరేటర్లు యాత్రలు తిరిగి రాస్తున్నారు. కరోనా వేళ మాస్‌గా వెళ్లేందుకు ఇష్టపడని కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో యాత్రలను రూపొందిస్తున్నారు. పర్యాటకుల ఇష్టాల మేరకు వారికి రవాణా సౌకర్యం, వసతి, భోజన ఏర్పాటు చూడడంలో ఇప్పుడు పర్యాటక సంస్థలు నిమగ్నమయ్యాయి.

irctc special tour packages
ఐఆర్‌సీటీసీ, టీఎస్‌ టీడీసీ ప్రత్యేక యాత్రలు
author img

By

Published : Jan 3, 2021, 1:45 PM IST

ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) నిర్వహిస్తున్న విమాన పర్యాటక యాత్రలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రకరకాల పేర్లతో రూపొందించిన 8 రకాల యాత్రలు ఆదరణకు నోచుకున్నాయి. మ్యాజికల్‌ మేఘాలయ, హెరిటేజ్‌ హంపి, మధ్యప్రదేశ్‌ మహాదర్శన్, అమేజింగ్‌ అండమాన్, కాశ్మీర్‌ యాత్ర, గంగారామాయణ్‌ యాత్ర, సౌరాష్ట్ర యాత్ర, మ్యాగ్నఫిసియంట్‌ మధ్యప్రదేశ్‌ యాత్రలను ఐఆర్‌సీటీసీ రూపొందించింది. విమానంలో వెళ్లడం.. తిరిగి విమానంలో రావడం.. స్థానికంగా కరోనా జాగ్రత్తలతో రోడ్డు ప్రయాణం, వసతి, భోజనం ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో నగరం నుంచి ప్రతి యాత్రకు 70 మందికి తక్కువ లేకుండా వెళ్లారు.

ఇవే కాకుండా..

ఎవరైనా 20 మంది సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. అందుకు యాత్రలను కూడా రూపొందిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఎల్‌టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. www.com.-ir-ctc.-com వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ ధరలతో పాటు.. మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే : 04027702401/ 07, 27808899 నంబర్లలో కూడా సంప్రదించవచ్చు.

టీఎస్‌టీడీసీతో పాటు ఆర్టీసీ..

తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నిత్యం నగర సందర్శనతో పాటు.. హెరిటేజ్‌ యాత్రలనూ చేపడుతోంది. ఇటీవల షిరిడీ యాత్రలను ప్రారంభించింది. పంచారామాలకూ తీసుకెళ్లింది. త్వరలో తిరుపతి యాత్రను కూడా ప్రారంభించనుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య బోటు షికారులను రూపొందించింది. ఇన్నోవా కారు నుంచి మినీ బస్సు వరకూ సరిపడేంతమందితో యాత్రలకు తీసుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది.

* పర్యాటకుల ఆకాంక్షల మేరకు ప్రణాళికలు

* ఐఆర్‌సీటీసీ, టీఎస్‌టీడీసీ ప్రత్యేక యాత్రలు

పూర్తి వివరాలకు 180042546464 టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు.. 9848540371, 9848125720, 9848306435 నంబర్లలో సంప్రదించాలని పర్యాటకాభివృద్ధి సంస్థ సూచించింది.

ఇదీ చూడండి:

సంక్రాంతి స్పెషల్: విజయవాడ నుంచి హైదరాబాద్​కు ప్రత్యేక విమానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.