ETV Bharat / city

ట్రిపుల్‌ఐటీల్లో ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీకి ఆహ్వానం - రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉన్న 200 సీట్ల భర్తీకి విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి, ఉపకులపతి ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

iiit
iiit
author img

By

Published : Oct 29, 2021, 8:23 AM IST

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉన్న 200 సీట్ల భర్తీకి విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి, ఉపకులపతి ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీట్ల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్‌సైట్‌ www.rgukt.inలో నవంబరు 20లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయకున్నా ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్నవారు నవంబరు 30న ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ఐటీల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌కు హాజరుకండి:

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆర్జీయూకేటీసెట్‌ రాసిన అభ్యర్థులకు, వారు సాధించిన ర్యాంకుల ఆధారంగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటూ వ్యక్తిగత సమాచారం పంపినట్లు ఆచార్య కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.