లక్షల కొద్ది కేసులు... వేల కొద్ది మరణాలు. ఒక్క రోజులో కరోనా సృష్టిస్తున్న విధ్వంసమిది. ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యాప్తి చెందుతూ పరిశోధకులకే సవాలు విసురుతోంది. ఇక మ్యూటేషన్‌లు సరే సరి. దాదాపు రెండు నెలలుగా ఈ ఉత్పరివర్తనాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కొత్త రకాల వైరస్‌లు వేగానికి కళ్లెం వేయటం సాధ్యం కావటం లేదు. ఈ పరిణామాలకు తోడు సింహాలకూ వైరస్ సోకిందని తేలటం ఇంకా కలవరపాటుకు గురి చేసింది. ఎన్440కే వైరస్ రకం విస్తరించటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందన్న వార్తలొస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్న చర్చలూ జరుగుతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత..? జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రమాదముందా..? భారత్‌లో ఏ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది..? ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్నారు...సీసీఎమ్‌బీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె. మిశ్రా. త్వరలోనే డబుల్ మ్యూటెంట్ కేసులూ పెరిగే ముప్పు పొంచి ఉందని చెబుతున్న రాకేశ్ మిశ్రాతో ప్రత్యేక ముఖాముఖి.