Venkaiah Naidu About Yoga : ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొదించడానికి యోగా ఉపయోగపడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని సూచించారు. పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగా అని...దీనిని మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.
Yoga Day 2022 : తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటుడు అడవి శేషు హాజరయ్యారు . యోగా విశిష్టితను తెలియజేసేలా వివిధ ఆసనాలు వేశారు.
'యోగం అంటే సాధన చేయడం. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిది. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది. కుల మతాలకు అతీతమైనది.. భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా. ఇది ప్రపంచ దేశాల్లో శాంతికి దోహదం చేస్తుంది. ఏ స్థాయిలో ఉన్నా యోగా సాధన తప్పనిసరి. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది. పెద్దలు మనకు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రపంచ శాంతిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలి. యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చు.' -- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
యోగా దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. అప్పుడప్పుడు కాకుండా.. రోజూ సాధన చేస్తూ ఉండాలని చెప్పారు. యోగాతో శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉంటామని తెలిపారు.
ఇవీ చదవండి :