కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ మొదలైంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ చేపట్టాలని విచారణాధికారిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
విచారణ నివేదికను మే 3 నాటికి కోర్టుకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మాజీ డీజీపీలు రాముడు, సాంబశివరావు, మాజీ డీజీపీలు మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ సాక్షులుగా విచారణకు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు