TS Inter results: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో 56 శాతం బాలికలు, 42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది ఉత్తీర్ణత సాధించారు. tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్సైట్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఫలితాలను ఉంచినట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు ఈనెల 22 వరకు తుదిగడువును విధించింది.
కరోనా కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ మెదటి ఏడాది విద్యార్థులందరినీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. పరిస్థితులు కుదుట పడటంతో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. గత నెల 3న ఈ పరీక్షలు ముగిశాయి. సాధారణంగా నెల రోజుల్లోపే ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసేది. కాస్త జాప్యం కావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట లభించింది.
ఇంటర్ ఫలితాల కోసం: క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: