యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి బయటికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి రుషిచంద్ (17) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం వెతుకుతుండగా రెండు రోజుల తర్వాత పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాత్రి ఇంట్లో వాళ్లపై అలిగి బయటకు వచ్చిన విద్యార్థి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం వెతికారు. రెండు రోజుల క్రితం ఆలేరు-పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు భువనగిరి రైల్వే పోలీస్ ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.