ETV Bharat / city

Inter Exams: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు - ఇంటర్‌ పరీక్షల వార్తలు

రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు, మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

ఇంటర్‌ పరీక్షలు
Inter Exams
author img

By

Published : Sep 14, 2021, 4:07 PM IST

రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కనీస మార్కులతో విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసినప్పటికీ మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. బెటర్‌మెంట్‌ రాసి ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు, మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నపత్రాలను పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా సీసీ కెమెరాల నిఘా పెట్టారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకాధికారులను నియమించారు. విద్యార్థులకు నిత్యం మంచి నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

కొవిడ్‌ దృష్ట్యా..

అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రశ్నాపత్రాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేశారు. కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లేటప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేశారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారు ఆ గదిలో పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటారు. కేంద్రాలను శానిటైజ్‌ చేస్తున్నారు. థర్మల్‌ స్కానింగ్‌ అనంతరం పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. పీపీ కిట్లు అందుబాటులో ఉంచారు.

జిల్లాలో మొత్తం కేంద్రాలు 142

ప్రథమ సంవత్సర విద్యార్థులు 54,326

ద్వితీయ సంవత్సర విద్యార్థులు 59,212

1,13,538మంది...

జిల్లాలో మొత్తం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పరీక్షల నిర్వహణకు కస్డోడియన్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించారు. కోడ్‌ల వారీగా వచ్చిన పరీక్ష పత్రాలను ఆయా ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. మొత్తం మొదటి, రెండో సంవత్సర విద్యార్థులు 1,13,538 మంది పరీక్ష రాయనున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం

పరీక్షలు రాసే విద్యార్థులు అర గంట ముందు కేంద్రాలకు చేరుకోవాలి. ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశాం. ప్రశ్నపత్రాలు పోలీసుస్టేషన్‌లో భద్రపరిచాం. నాలుగు ప్లయింగ్‌ స్క్వాడ్‌లు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను సిద్ధంగా ఉంచాం. సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చాం. పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. - రవికుమార్‌, ఆర్‌ఐవో, ఇంటర్‌ విద్య

ఇదీ చదవండి

వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.