ETV Bharat / city

తెలంగాణలో ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన - తెలంగాణలో ఇంటర్ మూల్యాంకన అధ్యాపకుల ఆందోళన

తెలంగాణలో ఇంటర్​ ముల్యాంకనం చేసే అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల మూల్యాంకనానికి వెళ్లే ప్రత్యేక బస్సులను ఆపేశారు. నగర శివార్లలోకి వెళ్లాలంటే.. ప్రైవేటు వాహనాల ఛార్జీలు తట్టుకోలేమంటూ... అధ్యాపకులు ఆందోళన చేశారు.

inter-evaluation-faculty-protest-for-special-buses-in-rangareddy-district
తెలంగాణలో ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన
author img

By

Published : May 20, 2020, 11:48 AM IST

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల ఇంటర్ మూల్యాంకనానికి వెళ్లే అధ్యాపకుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు కేవలం నగర శివార్లలోకే వెళ్తుండడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని... ఆ ఛార్జీలు తట్టుకోలేమని అధ్యాపకులు వాపోతున్నారు.

తాండూరు, వికారాబాద్, పరిగి నుంచి వచ్చే అధ్యాపకులు దాదాపు 300 మంది గంటల తరబడి చేవెళ్ల బస్టాండ్‌లో వేచి ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి తమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: నేటి సాయంత్రానికి తీరం దాటనున్న 'అంపన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.