వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం రేపు ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కమిషనర్ కన్నబాబు వివరించారు. 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికలపై రెండు రహస్య జీవోలు జారీ