ETV Bharat / city

vijay sethupathi: విజయ్ సేతుపతిని తంతే రూ.1001 అంటూ ప్రకటన..

తమిళ నటుడు విజయ్ సేతుపతిపై హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ సంచలన ప్రకటన చేసింది. బెంగళూరు ఎయిర్ ​పోర్ట్​లో జరిగిన ఘటనకు కారణం విజయ్ తమ వర్గానికి చెందిన నాయకుడిని అవమానించటమేననేది ఈ సంస్థ ఆరోపణ.

vijay sethupathi
vijay sethupathi
author img

By

Published : Nov 8, 2021, 10:04 PM IST

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తదనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ సేతుపతికి, నిందితునికి పోలీసు ​స్టేషన్​లోనే రాజీ కుదిరిందని విజయ్ చెప్తున్నా వివాదం సద్దుమణిగేలా కనిపించట్లేదు.

హిందూ మక్కల్ కట్చి తాజాగా సంచలన ప్రకటన చేసింది. విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి ఒక్కో తన్నుకు రూ.1001 నగదు బహుమతి అంటూ అధికారిక ట్విటర్ హ్యాండిల్​లో ప్రకటించింది. తమ దైవాన్ని అవమానించిన విజయ్ సేతుపతి క్షమాపణ చెప్పేవరకూ ఈ బహుమతి ఉంటుందని తెలిపింది.

కానీ.. ఈ ఘటనను విజయ్ సేతుపతి చిన్నదిగా కొట్టిపడేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారని, సమస్య పోలీసు స్టేషనులోనే పరిష్కారమైందని వెల్లడించారు. కానీ, హిందూ మక్కల్ కట్చి మాత్రం సమస్యను మరింత పెద్దది చేసేలా ప్రకటన చేయడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. దక్షిణాదిన పలు ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు.

  • இது வரை விஜய் சேதுபதி எந்த விளக்கமும் அளிக்காததால் விஜய் சேதுபதிக்கு இந்த எச்சரிக்கை ....!!!! https://t.co/DCqu7Aye4v

    — Indu Makkal Katchi (Offl) 🇮🇳 (@Indumakalktchi) November 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

మాజీ ఎంపీ టి.సుబ్బరామి రెడ్డి కంపెనీ చీటింగ్​ కేసులో నిందితులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.