IMA ON Covid Deaths Compensation: రాష్ట్రంలో కొవిడ్‌తో చనిపోయిన 85 మంది వైద్యులకు వెంటనే పరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని కోరింది. కొవిడ్ కాలంలోనూ వైద్యులు సమర్థంగా సేవలందించారని గుర్తు చేశారు. అలాంటి వారు కొవిడ్‌తో చనిపోతే.. ఇప్పటి వరకు వారి కుటుంబాలకు కొవిడ్ సాయం అందలేదని సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
IMA ON Omicron Variant: కొవిడ్ పరిహారం విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. కొవిడ్ వారియర్లకు పరిహారం అందించాలన్నారు. డెల్టా కంటే 4 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని.. కానీ తీవ్రమైంది కాదని నివేదికలు వచ్చినట్లు తెలిపారు.
దేశంలో 60 శాతం ప్రజలకు వాక్సినేషన్ పూర్తి కాలేదని, అందరికీ రెండు డోసుల వాక్సిన్ పూర్తి చేయాలని కోరారు. ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదనేది తమ అభిప్రాయమన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
Sea Came Farward in Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం