గల్ఫ్ ఆఫ్ మన్నార్ - రామనాథపురం తీరంలో స్థిరంగా కొనసాగిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం ప్రభావంతో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఆ శాఖ వివరించింది. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: