ETV Bharat / city

LAND VALUE INCREASE: తెలంగాణలో పెరిగిన భూముల మార్కెట్​ విలువ.. నేటి నుంచే అమలు - telangana latest news

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మార్కెట్​ విలువలు, స్టాంపు డ్యూటీ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. వారం, పది రోజులు రిజిస్ట్రేషన్ల సంఖ్య.. భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధరల పెంపు విషయంలో.. అధికారులకు ఎలాంటి ప్రమేయం లేకుండా చేయడం ద్వారా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పారదర్శకతకు పెద్దపీట వేసింది.

increased-market
increased-market
author img

By

Published : Jul 22, 2021, 9:16 AM IST

తెలంగాణలో పెరిగిన ధరలతో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పెంచిన మార్కెట్​ విలువలు, రిజిస్ట్రేషన్​ ఛార్జీలు.. ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన.. 3 ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు.. స్టాంపు డ్యూటీ పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్​ ఫీజును 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్​ విలువ ఎకరాకు రూ.75 వేల రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా 50, 40, 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్​ విలువలను పెంచింది.

అదే విధంగా ఓపెన్​ ఫ్లాట్ల చదరపు గజం కనీస ధర 100 నుంచి 200 రూపాయలకు పెంచిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా తక్కువ ధర కలిగిన వాటిపై 50 శాతం.. మధ్య రకం విలువలు కలిగిన వాటిపై 40 శాతం, ఎక్కువ విలువలు కలిగిన వాటిపై 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో పెంచినట్లు స్పష్టం చేసింది.

ఒక్క బటన్​ నొక్కగానే.. విలువలు అప్డేట్..

అపార్ట్​మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు.. కనీస విలువ 800 నుంచి వెయ్యి రూపాయలకు పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20, 30 శాతం లెక్కన రెండు స్లాబులు పెంచినట్లు వెల్లడించింది. ప్రాంతాల వారీగా, గ్రామాలు, పట్టణాలు వారీగా పెంచిన మార్కెట్​ విలువలు.. ఇప్పటికే అప్డేట్ అయ్యాయి. పెంపునకు సంబంధించి సాఫ్ట్​వేర్​ ముందే సిద్ధం చేసి పెట్టుకోవడంతో ఒక్క బటన్​ నొక్కగానే ఆటోమెటిక్​గా విలువలు అప్డేట్ అయ్యాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ అధికారులు తెలిపారు.

మరో 40 శాతం వరకు అదనంగా ఆదాయం..

మరోవైపు... 2 రకాల ధరల పెరుగుదలతో ఆ ప్రభావం వారం, పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లపై ఉంటుందని.. ఇందువల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్​ విలువలు, స్టాంపు డ్యూటీ... రెండూ పెరుగుదల వల్ల ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వస్తున్న రాబడిపై మరో 40 శాతం వరకు అదనంగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సబ్​ రిజిస్ట్రార్లకు, జిల్లా రిజిస్ట్రార్లకు, ఇతర అధికారులకు.. ధరల పెంపులో ఎలాంటి ప్రమేయం లేకుండా చేయడం ద్వారా... స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయ్యిందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

Rains in Andhra Pradesh: నేడు కోస్తాలో భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.