లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా గత నాలుగు రోజులుగా రోజుకు సగటున రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. బుధవారానికి రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 157.4 ఎంయూలకు చేరింది. లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు 1,134 పరిశ్రమలకు ఎన్వోసీలకు పరిశ్రమల శాఖ జారీ చేసింది. వారం కిందటి వరకు 483 పరిశ్రమలు మాత్రమే పని చేస్తున్నాయి. వారం రోజుల్లో 651 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించటానికి వీలుగా పరిశ్రమల శాఖ అనుమతిలిచ్చింది. దాంతో పారిశ్రామిక విద్యుత్తు వినియోగం పెరిగింది.
ఇదీ చదవండి: రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలే లక్ష్యం