ETV Bharat / city

నిష్పాక్షిక విచారణ సాధ్యపడదు: హోంశాఖ ముఖ్య కార్యదర్శి - high court comments on government

రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై కేసుల్లో జస్టిస్ రాకేశ్​కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ... హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.

Impartial inquiry is not possible: Chief Secretary of AP Home Department

author img

By

Published : Dec 18, 2020, 4:21 AM IST

రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై కేసుల్లో జస్టిస్ రాకేశ్​కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ... రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ విచ్ఛిన్నంపై తేల్చాలని పిటిషన్ దాఖలు కాకపోయినా... జస్టిస్ రాకేశ్​కుమార్ తనకు తానుగా విచారణ జరపడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. విచారణ పూర్తి కాకుండానే ముందుగా ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై జస్టిస్ రాకేశ్​కుమార్ సభ్యులుగా ఉన్న ధర్మాసనంలో... నిష్పాక్షిక విచారణ సాధ్యపడదని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అభిప్రాయపడ్డారు. అడ్వొకేట్ జనరల్ చెప్పే వాదనలను వినకుండానే... ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేశారని గుర్తుచేశారు. ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్ దాఖలు చేసిన అదనపు వివరాలపై వాదనలు చెప్పే అవకాశాన్ని పోలీసుల తరపు ప్రత్యేక సీనియర్ కౌన్సిల్​కు ఇవ్వలేదని వివరించారు.

ఇదీ చదవండీ... విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.