ETV Bharat / city

Impact fee ఇంపాక్ట్‌ భారం రూ.600 కోట్లు - నిర్మాణ సామగ్రి ధరలకు ఇంపాక్ట్‌ ఫీజు

పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలకు ఇంపాక్ట్‌ ఫీజు తోడవ్వడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటికే 7-10 రకాల ఫీజుల కింద లక్షల రూపాయలు పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇంపాక్ట్‌ ఫీజు పేరుతో అదనపు భారం పడనున్నందున ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నివాస, వాణిజ్య, పారిశ్రామికేతర భవనాలన్నింటిపైనా కలిపి ఇంపాక్ట్‌ ఫీజు భారం రూ.600 కోట్ల వరకు పడనుంది.

impact
ఇంపాక్ట్‌
author img

By

Published : Aug 13, 2022, 10:37 AM IST

Updated : Aug 13, 2022, 11:51 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఏటా 30-35 వేల కొత్త ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణం కోసం పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. వీటిలో 150 అడుగుల వెడల్పు దాటిన ప్రధాన రహదారులకు ఇరువైపులా నిర్మాణాలు 45% వరకు ఉంటున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల్లో భారీగా గ్రామాలను విలీనం చేశాక ప్రత్యేకించి ప్రధాన రహదారులకు ఇరువైపులా కొత్త నిర్మాణాలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని 90% ప్రాంతాన్ని అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థలో విలీనం చేశారు. పుర, నగరపాలక సంస్థలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో చేపట్టే నిర్మాణాలకూ ఇంపాక్ట్‌ ఫీజు వర్తింపజేయాలన్న నిర్ణయంతో ప్రజలపై భారీగా భారం పడనుంది. ప్రత్యేకించి విజయవాడ-గుంటూరు, విజయవాడ-మచిలీపట్నం, విశాఖపట్నం-విజయనగరం, విశాఖపట్నం-శ్రీకాకుళం, తిరుపతి-నాయుడుపేట, తిరుపతి-చెన్నై రోడ్లకు ఇరువైపులా కొత్తగా చేపట్టే నిర్మాణాలపై ఇంపాక్ట్‌ ఫీజు ప్రభావం ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* ఇకపై అన్నివర్గాల మీద కలిపి ఇంపాక్ట్‌ ఫీజు భారం రూ.600 కోట్ల వరకు పడుతుందని అంచనా. ఇప్పుడు చెల్లిస్తున్న ఫీజులన్నింటి కంటే ఇంపాక్ట్‌ ఫీజు ఒక్కటే ఎక్కువ. కొత్త అనుమతుల కింద పట్టణ ప్రణాళిక విభాగానికి ఇప్పటివరకు ఏటా దాదాపు రూ.600 కోట్లు వస్తోంది. 150 అడుగులపైన వెడల్పు కలిగిన ప్రధాన రహదారులకు ఇరువైపులా 250 మీటర్లలోపు చేసే ఇళ్ల నిర్మాణాలపై ఇంపాక్ట్‌ ఫీజు వర్తిస్తుంది. ఈ కారణంగా ఆదాయం భారీగా పెరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

స్థిరాస్తి వ్యాపారం డీలా...

కొత్త లేఅవుట్లలో 5% స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో లేఅవుట్ల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య గత ఏడాదిన్నరలో బాగా తగ్గింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 దరఖాస్తులకు మించి రాలేదు. 5% స్థలం ఇవ్వాలన్న నిర్ణయానికి ముందు ఏటా 150 నుంచి 200 కొత్త లేఅవుట్లకు వ్యాపారులు అనుమతులు తీసుకునేవారు. కొనుగోళ్లు తగ్గినందున అపార్టుమెంట్ల నిర్మాణంపైనా వ్యాపారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రస్తుతం దాదాపు 320 అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. 150 అడుగుల వెడల్పు దాటిన ప్రధాన రహదారులకు ఇరువైపులా చేసే నిర్మాణాలకు ఇంపాక్ట్‌ ఫీజు విధించడంతో అపార్టుమెంట్ల నిర్మాణ సంఖ్య ఇంకా తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. ‘గతంలో కంటే ధరలు కాస్త తగ్గించినా, ఇప్పటికీ ఫ్లాట్లు కొనేవారు అంతంతగానే ఉన్నారు. ఇప్పుడు ఇంపాక్ట్‌ ఫీజు విధించినందున ఇంకా ధర పెంచి అమ్మితే కొనడానికి ఎవరు ముందుకొస్తారు’ అని విజయవాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్థిరాస్తి వ్యాపారం మరింత దిగజారుతుందని విశాఖకు చెందిన మరో వ్యాపారి వ్యాఖ్యానించారు.

* కొత్త నిర్మాణాలకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఇంపాక్ట్‌ ఫీజు తక్షణం రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు హెచ్చరించారు.

* విజయవాడ బైపాస్‌ రోడ్డులోని పోలీసు కాలనీలో 1,710 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం నగరపాలక సంస్థ ఇప్పటివరకు రూ.1.40 లక్షలు వసూలుచేస్తోంది. కొత్తగా వచ్చిన ఇంపాక్ట్‌ ఫీజు కింద ఎస్‌ఎఫ్‌టీకి రూ.75 చొప్పున రూ.1,28,250 అదనంగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకారం స్థలం విలువ రూ.57 లక్షలు. దీనిపై 2% ఇంపాక్ట్‌ ఫీజు అంటే రూ.1.14 లక్షలు అవుతుంది. దీనికంటే ఎస్‌ఎఫ్‌టీ ధర ఎక్కువ కావడంతో దాన్నే వసూలు చేస్తారు.

* విశాఖపట్నం-తగరపువలస మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా 2వేల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం జీవీఎంసీ ఇప్పటివరకు సగటున రూ.1.30 లక్షలు వసూలుచేస్తోంది. ఇంపాక్ట్‌ ఫీజు కింద ఎస్‌ఎఫ్‌టీకి రూ.75 చొప్పున రూ.1.50 లక్షలు అదనంగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ల శాఖ విలువల ప్రకారం ఇక్కడ స్థలం విలువ రూ.28,88,889. ఇందులో 2% అంటే రూ.57,778. దీనికంటే ఎస్‌ఎఫ్‌టీ ధర ఎక్కువ కావడంతో.. అదే వసూలు చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.