కర్ణాటక నుంచి రాష్ట్రంలోని పెనుకొండకు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా పావగడనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు... 400 మద్యం సీసాలు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళంలో...
ఒడిశా నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 233 మద్యం సీసాలను ఇచ్చాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగంర జిల్లా చీపురుపల్లిలో స్పెషల్ ఎన్మోర్ఫ్మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం వేగవరంలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి వాడే 700 లీటర్ల బెల్లపు వూటను ధ్వంసం చేసి ఒకరిని అరెస్టు చేశారు.
కడప జిల్లాలో...
కడప జిల్లా మైదుకూరు సమీప పాతపాలెం క్రాస్‌రోడ్డు వద్ద... నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 2 లక్షలు విలువ చేసే ఉత్పత్తులతో మైదుకూరుకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా నూజివీడు నుంచి రెడ్డిగూడేనికి అక్రమంగా తరలిస్తున్న 3000 కేజీల బెల్లం ఊటలను ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: