ETV Bharat / city

IIT Student Suicide: ఐఐటీ విద్యార్థి సూసైడ్.. లేఖలో విస్తుపోయే విషయాలు..! - ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

IIT Student Suicide: చిన్న చిన్న కారణాలతో నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రస్తుత యువత సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. అలాగే ఓ యువకుడు యూట్యూబ్ ఛానెల్​ ప్రారంభించాడు. తన ఛానెల్​కు వీక్షకులు లేరని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఐఐటీ విద్యార్థి సూసైడ్.. లేఖలో విస్తుపోయే విషయాలు..!

author img

By

Published : Jul 22, 2022, 9:27 AM IST

IIT Student Suicide: తెలంగాణలోని హైదరాబాద్​​ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాంతి నగర్​లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగంతస్తుల భవనం నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో ఐఐటీ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న దీనా(24) ఆత్మహత్య చేసుకున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడితోనే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

దీనా చిన్నప్పటినుంచి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సెల్ఫ్​ లో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న దీనా అందులో పలు వీడియో గేమ్స్​కు సంబంధించిన సూచనలను అప్​లోడ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న దీనా.. వీడియో గేమ్ ఏ విధంగా ఆడాలి వాటిలో మెలకువలు ఏ విధంగా నేర్చుకోవాలనే దానికి సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేశాడు.

దీనాను అందరూ ముద్దుగా యూట్యూబ్​లో సెల్ఫ్ లో అని పిలుచుకుంటారు. దీనా ఆత్మహత్య చేసుకునే ముందు తన యూట్యూబ్ ఛానల్​లో ఒక వీడియో అప్ లోడ్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలను వివరించాడు. సూసైడ్ లెటర్​ను సైతం అందులో ఉంచాడు. చిన్నప్పటినుంచి ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు... సంతోషం లేని జీవితం గడిపినట్లు దీనా లేఖలో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు సైతం నిత్యం తిట్టేవారని ఎన్నో అవమానాలు భరించినట్లు లేఖలు రాశాడు. అందరూ స్వార్థం కోసం తనను ఉపయోగించుకున్నారని ఒక్కరు కూడా తనకు ఉపయోగపడలేదని లేఖలో పేర్కొన్నాడు.

భవనం పైకి ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఒకటో తరగతి చదువుతున్న సమయంలో డైరీలోనే రాశానని అది చూసి క్లాస్ టీచర్​తో పాటు తల్లిదండ్రులు తనను కొట్టారని దీనా సూసైడ్ నోట్​లో తెలిపాడు. గ్వాలియర్​లో ఐఐటీ నాలుగో సంవత్సరం చదువుతున్న దీనా సెలవుల కోసం కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. దీనా ఎవరితోనూ స్నేహం చేసే వాడు కాదని గదిలోనే ఉంటూ కనీసం బయటికి కూడా వచ్చేవాడు కాదని స్థానికులు తెలిపారు. ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ వాటితో కొత్త కొత్త వీడియోలు సృష్టించడం దీనాకు ఎంతో ఆసక్తి అని వెల్లడించారు. తన యూట్యాబ్ ఛానల్​కు ఎక్కువ మంది వీక్షకులు రావాలని దీనా ఆశించేవాడని... దీనివల్ల కూడా ఒత్తిడికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న క్లూస్‌ టీం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఐఐటీ విద్యార్థి సూసైడ్.. లేఖలో విస్తుపోయే విషయాలు..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.