మూడు రాజధానుల ఉద్యమంతో అమరావతి గ్రామాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని రాజధాని రైతులు ఆరోపించారు. తమను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చిన వైకాపా మంత్రులు, నేతలు...మూడు రాజధానులకు మద్దతుగా చేసే ధర్నాలో ఎవరు పాల్గొంటున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనే వారికి ఈ ప్రాంతంలో ఎక్కడా భూములు లేవని చెప్పారు.
తామంతా ఆధార్, పాస్ పుస్తకాలు తీసుకొస్తామని..,వారు వాటిని తీసుకువస్తారా అని ప్రశ్నించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 312వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మందడం, తుళ్లూరులో రైతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీచదవండి
ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని