ETV Bharat / city

నేను వెళ్లడం కుదరదు.. అమ్మే నా దగ్గరికి రావాలి: అమృత - మారుతీరావు ఆత్మహత్య

తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూడకుండా బంధువులు అడ్డుకున్న తర్వాత అమృత నోరు విప్పింది. మారుతీరావు ఆత్మహత్య అనంతరం మీడియా ముందు పెద్దగా స్పందించని ఆమె.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడింది.

కుటుంబాన్ని వదిలి రావటం కుదరదు.. అమ్మే నా దగ్గరికి రావాలి

author img

By

Published : Mar 9, 2020, 7:15 PM IST

కుటుంబాన్ని వదిలి రావటం కుదరదు.. అమ్మే నా దగ్గరికి రావాలి

తన తండ్రి మారుతీరావు అంత్యక్రియలకు రాకుండా బంధువులు అడ్డుకున్న నేపథ్యంలో మిర్యాలగూడ అమృత నోరు విప్పింది. మారుతీరావు ఆత్మహత్య తర్వాత మీడియా ముందు పెద్దగా స్పందించని ఆమె.. అంత్యక్రియల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడింది.

తెలంగాణలోని మిర్యాలగూడలో తన అత్తింటి దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. భర్త, పిల్లలు సర్వస్వం... దూరమైతే ఎవరైనా ఒంటరిగానే మిగలాల్సి వస్తుంది. బంధువులు, పక్కవాళ్లు ఎవరు చూసినా.. పది రోజులు, ఆరు నెలలు, మహా.. అంటే ఏడాది. ఆ తర్వాత వాళ్లను ఎవరూ పట్టించుకోరని పేర్కొంది. అమ్మ ఇప్పుడు ఒంటరింగా మిగిలింది. నా దగ్గరికి వస్తే.. ఆమె బాధ్యతలు తనే తీసుకుంటానని చెప్పింది. కుటుంబాన్ని వదిలి రావటం కుదరదని, అమ్మే తన దగ్గరికి రావాలని కోరింది. మారుతీరావు ఆస్తులపై తనకు ఆసక్తి లేదంది.

ఇదీ చూడండి:

మిర్యాలగూడలో మారుతీరావు అంత్యక్రియలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.